Monday, October 20, 2025

AP DSC 2026 Notification - అదిగదిగో మరో డీఎస్సీ..!

 అదిగదిగో మరో డీఎస్సీ..!

ఉద్యోగార్థుల్లో ఆనందం


ఏ శాఖలో అయినా ఆలోచిస్తాం కానీ విద్యాశాఖలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయం.. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. ఇది తథ్యం. అభ్యర్థులూ సిద్ధమవు తూనే ఉండండి. -  ఇటీవల సీఎం చంద్రబాబు పిలుపు


• మెగా డీఎస్సీ ప్రక్రియ రికార్డు స్థాయిలో నాలుగు నెలల్లో పూర్తిచేశాం. మరో డీఎస్సీ ప్రకటన జనవరిలో ఇస్తాం. మార్చిలో పరీక్ష నిర్వహించి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం లోనే నియామక ఉత్తర్వులు అందిస్తాం. నవంబర్ టెట్ కూడా వేస్తాం తయారవండి - విద్యా శాఖ మంత్రి లోకేశ్

మెగా డీఎస్సీతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 మంది కళ్లలో ఆశలు నింపిన రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీకి రంగం సిద్ధం. ఇటీవల త్రుటిలో ఉద్యోగావకాశాలు కోల్పోయిన వేల మంది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థుల్లో ఇది ఆశలు రేపుతోంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెగా డీఎస్సీకి వేల మంది 63,004 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,241 మంది ఎంపికయ్యారు. ఉద్యోగం రాని మిగిలిన అభ్యర్థులు మళ్లీ సన్నద్ధులవుతు జిల్లాలో న్నారు. మెగా డీఎస్సీకి 44 ఏళ్ల వరకు దర 'ఖాస్తు చేసుకొనేందుకు అనుమతివ్వడంతో నియామకాల్లో 30 శాతం మంది ఈసారి నియా మకాలు సాధించారని అధికారులు అంచనా వేశారు. మరోడీఎస్సీకి కూడా ఇదే వయోపరిమితి కొనసాగుతుందని

వయసు పెరుగుతున్న నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా శ్రమించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.


AP DSC 2026 Notification - అదిగదిగో మరో డీఎస్సీ..!

 అదిగదిగో మరో డీఎస్సీ..! ఉద్యోగార్థుల్లో ఆనందం ఏ శాఖలో అయినా ఆలోచిస్తాం కానీ విద్యాశాఖలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయం.. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామన...